meera chopra: మీరా చోప్రా- ఫ్యాన్స్ వివాదం: 15 మందికి పోలీసుల నోటీసులు.. అరెస్టు చేసే ఛాన్స్

police on meera chopra posts

  • సామాజిక మాధ్యమాల్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ వేధిస్తున్నారని ఫిర్యాదు
  • కేటీఆర్‌ జోక్యంతో దర్యాప్తు వేగవంతం
  • 15 మంది ఖాతాలను గుర్తించిన పోలీసులు

తనను సామాజిక మాధ్యమాల్లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ వేధిస్తున్నారని పోలీసులకు హీరోయిన్‌ మీరా చోప్రా  ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు కూడా ఆమె ట్వీట్ చేయగా, చర్యలు తీసుకుంటామని ఆయన ప్రకటించిన నేపథ్యంలో దీనిపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఆమెపై పదే పదే వ్యాఖ్యలు చేస్తోన్న 15 మంది ట్విట్టర్‌ ఖాతాలను పోలీసులు గుర్తించారు.

అనంతరం ఆ ఖాతాలను ఉపయోగిస్తున్న వారికి నోటీసులు పంపించారు. వారందరినీ పోలీసులు అరెస్టు చేయనున్నట్లు సమాచారం. కాగా, తనను అసభ్య పదజాలంతో దూషిస్తోన్న వారి  ట్వీట్లకు సంబంధించిన స్క్రీన్‌ షాట్లను మీరా చోప్రా ఇటీవల పోస్ట్ చేసిన విషయం తెలిసిందే.

meera chopra
Junior NTR
Twitter
Police
Hyderabad Police
  • Loading...

More Telugu News