Prabhas: ప్రభాస్ ఖాతాలో మరో సరికొత్త రికార్డు!

Prabhas creates one more record

  • 'బాహుబలి'తో పెరిగిపోయిన ప్రభాస్ ఇమేజ్ 
  • పాన్ ఇండియా స్థాయిలో చిత్రాల నిర్మాణం
  • ఫేస్ బుక్ లో 14 మిలియన్ల ఫాలోవర్లు
  • దక్షిణాది సినిమా తారల్లో ఇదొక రికార్డు

ప్రభాస్ సినిమా జీవితాన్ని 'బాహుబలి'కి ముందు.. 'బాహుబలి'కి తర్వాతగా విభజించి చూడాలి. ఎందుకంటే, అంతవరకూ మామూలు స్టార్ హీరోగా వున్న ప్రభాస్ 'బాహుబలి' సినిమా తర్వాత జాతీయ స్థాయి హీరో అయిపోయాడు. అతని ఇమేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది.. ఫాలోయింగ్ ఎంతగానో పెరిగిపోయింది. అప్పటి నుంచీ తను నటించే సినిమాల బడ్జెట్టూ పెరిగింది, బిజినెస్సూ పెరిగింది. దాంతో అతని సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్నాయి.

ఈ క్రమంలో సోషల్ మీడియాలో కూడా అతనికి ఎంతో క్రేజ్ ఏర్పడింది. ఫాలోవర్స్  విపరీతంగా పెరిగిపోయారు. తాజాగా ఫేస్ బుక్ లో ఆయనకు 14 మిలియన్ల ఫాలోవర్స్ ఏర్పడ్డారు. దీంతో దక్షిణాది సినిమా తారల్లో ప్రభాస్ ది ఒక రికార్డుగా చెబుతున్నారు. భాషతో, ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రపంచం నలుమూలలా ప్రభాస్ కి అభిమానులున్నారనడానికి ఇదొక ఉదాహరణగా చెప్పచ్చు.  

Prabhas
Bahubali
Facebook
  • Loading...

More Telugu News