Bollywood: బాలీవుడ్ నిర్మాత అనిల్ సూరిని కబళించిన కరోనా

Bollywood producer Anil Suri dies of coronavirus
  • శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు
  • చేర్చుకునేందుకు నిరాకరించిన రెండు ఆసుపత్రులు
  • పూర్తి జాగ్రత్తలతో అంత్యక్రియలు
బాలీవుడ్ నిర్మాత అనిల్ సూరి (77) కరోనాతో కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అనిల్ సూరి గురువారం సాయంత్రం మృతి చెందినట్టు ఆయన సోదరుడు రాజీవ్ సూరి తెలిపారు. ఈ నెల 2న అనిల్ తీవ్ర జ్వరంతో బాధపడ్డారని, ఆ తర్వాతి రోజు పరిస్థితి మరింత క్షీణించిందని, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారని తెలిపారు.

 దీంతో ఆయనను వెంటనే లీలావతి, హిందూజా ఆసుపత్రులకు తరలించామని, అయితే, చేర్చుకునేందుకు నిరాకరించారని ఆయన అన్నారు. చివరికి బుధవారం రాత్రి అడ్వాన్స్‌డ్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించినట్టు చెప్పారు. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆయన గురువారం రాత్రి ఏడు గంటల సమయంలో కన్నుమూసినట్టు తెలిపారు. కరోనా నేపథ్యంలో పూర్తి జాగ్రత్తలు పాటించి శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించినట్టు పేర్కొన్నారు. అనిల్ సూరికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా, బాలీవుడ్‌లో ఇటీవల వరుసగా సంభవిస్తున్న మరణాలు ఇండస్ట్రీని కలవరపెడుతున్నాయి.
Bollywood
Anil Suri
Producer
Corona Virus

More Telugu News