Uttarakhand: నెగెటివ్ అని తేలినా.. హోం క్వారంటైన్ నుంచి బయటకు రాని సీఎం

Uttarakhand CM tests corona negetive

  • నిన్న కేబినెట్ సమావేశాన్ని నిర్వహించిన ఉత్తరాఖండ్ సీఎం
  • మంత్రికి కరోనా అని తేలడంతో సెల్ఫ్ క్వారంటైన్ కు వెళ్లిన వైనం
  • పరీక్షల్లో నెగెటివ్ అని నిర్ధారణ

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ కు కరోనా పరీక్షలను నిర్వహించగా నెగెటివ్ అని తేలింది. దీంతో తమ సీఎంకు కరోనా లేదని అధికారులు ప్రకటించారు. వివరాల్లోకి వెళ్తే, నిన్న ముఖ్యమంత్రి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ భేటీకి హాజరైన టూరిజం మంత్రికి కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో, ఆయనకు పాజిటివ్ అని తేలింది. విషయం తెలిసిన వెంటనే, ముఖ్యమంత్రి సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు.

అనంతరం ఆయనకు పరీక్షలు నిర్వహించగా, నెగెటివ్ అని నిర్ధారణ అయింది. నెగెటివ్ అని తేలినప్పటికీ ముఖ్యమంత్రి ఇంకా సెల్ఫ్ క్వారంటైన్ లోనే ఉన్నారని అధికారులు తెలిపారు. అయితే మరో ముగ్గురు మంత్రులు మాత్రం స్వీయ నిర్బంధం నుంచి బయటకు వచ్చి, విధులను నిర్వహించారని చెప్పారు.

Uttarakhand
CM
Trivendra Singh Rawat
Corona Virus
Self Quarantine
  • Loading...

More Telugu News