hcql: హైడ్రాక్సీ క్లోరోక్విన్‌పై ప్రచురించిన కథనంపై వెనక్కి తగ్గుతూ ప్రకటన చేసిన 'ద లాన్సెట్'

lancet on hcql medicine

  • ఆ డ్రగ్ వాడకం మంచిది కాదంటూ ఇటీవల ప్రచురణ
  • మరణాల ముప్పు పెరుగుతుందన్న 'ద లాన్సెట్‌'
  • అధ్యయనంలోని లోపాలను ఎత్తిచూపిన ప్రపంచ శాస్త్రవేత్తలు
  • 'ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ కన్‌సర్న్'‌ ప్రకటన విడుదల

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభణ నేపథ్యంలో హైడ్రాక్సీ క్లోరోక్విన్‌కు డిమాండ్‌ పెరుగుతోన్న వేళ ఆ ఔషధం వాడకం మంచిది కాదంటూ ఇటీవల ప్రముఖ వైద్య పత్రిక 'ద లాన్సెట్‌' ఓ కథనం ప్రచురించింది. అయితే, తమ కథనంపై తాజాగా వెనక్కి తగ్గింది. ఆ డ్రగ్‌ వల్ల మరణాల ముప్పు పెరుగుతుందంటూ అధ్యయంలో తేలిందంటూ తాము చెప్పిన విషయంపై స్పందించింది.

ఆ అధ్యయనంలోని లోపాలను ప్రపంచంలోని సుమారు 100 మందికి పైగా శాస్త్రవేత్తలు ఎత్తిచూపారు. తమ పరిశోధనపై తీవ్ర స్థాయిలో శాస్త్రీయ ప్రశ్నలు వచ్చాయని, దీంతో తమ రీడర్లను అప్రమత్తం చేయడానికి ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ కన్‌సర్న్‌ ప్రకటన చేస్తున్నట్టు తెలిపింది.

'ద లాన్సెట్‌' చేసిన ఈ ప్రకటనపై భారత్‌ స్పందించింది. కరోనా చికిత్సలో హైడ్రాక్సీ క్లోరోక్విన్ సమర్థతపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ పరిశోధనను చేయాలనుకుందని, అయితే, లాన్సెట్ ఇటీవల చేసిన‌ ప్రచురణ నేపథ్యంలో ఆ ప్రయత్నాలపై వెనక్కి తగ్గిందని భారత పరిశోధకులు చెప్పారు. లాన్సెట్‌ ప్రచురణను ప్రశ్నిస్తూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలువురు శాస్త్రవేత్తలు లేఖలు రాయడంతో డబ్ల్యూహెచ్‌వో తన నిర్ణయాన్ని మార్చుకుందని, తమ అధ్యయనాన్ని కొనసాగించాలని తిరిగి నిర్ణయం తీసుకుందని చెప్పారు.

  • Loading...

More Telugu News