Sai Pallavi: బిగ్ ఆఫర్ ను తిరస్కరించిన సాయిపల్లవి?

Sai Pallavi rejects a big offer

  • పాత్ర నచ్చితేనే ఒప్పుకునే నటి 
  • గోపీచంద్ తో తేజ తాజా చిత్రం
  • సాయిపల్లవికి కథ నచ్చలేదట
  • అనుష్క కోసం ప్రయత్నాలు

మన కథానాయికలలో సాయిపల్లవి చాలా డిఫరెంట్!
మిగతా వాళ్లలా వచ్చిన ప్రతి ఆఫర్నీ ఒప్పేసుకోదు. ఎంత పెద్ద డైరెక్టర్ నుంచి ఆఫర్ వచ్చినా క్యారెక్టర్ నచ్చితేనే చేస్తుంది. లేకపోతే, ఏమాత్రం మొహమాటం లేకుండా నో చెప్పేస్తుంది. ఎంత పెద్ద పారితోషికం ఇస్తానన్నా ఒప్పుకోదు. తాజాగా అలాగే ఓ భారీ ఆఫర్ ను ఆమె తిరస్కరించినట్టు తెలుస్తోంది.

ప్రముఖ దర్శకుడు తేజ త్వరలో యాక్షన్ హీరో గోపీచంద్ తో ఓ చిత్రాన్ని చేయనున్నాడు. 'అలిమేలుమంగ వెంకటరమణ' పేరుతో రూపొందే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఇందులో కథానాయిక పాత్ర కోసం ఇటీవల సాయిపల్లవిని తేజ సంప్రదించాడట. అయితే, తేజ చెప్పిన కథ, పాత్ర ఆమెకు నచ్చకపోవడంతో వెంటనే ఆమె 'నో' చెప్పేసిందని అంటున్నారు. దీంతో ఈ పాత్రకు ఇప్పుడు అనుష్కను సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది.  

Sai Pallavi
Teja
Gopichand
Anushka Shetty
  • Loading...

More Telugu News