India: వచ్చేనెల నుంచి అంతర్జాతీయ విమాన సేవలు పునఃప్రారంభం

flights service resume soon

  • ఇటీవలే దేశీయ విమాన సేవలకు గ్రీన్ సిగ్నల్ 
  • అంతర్జాతీయ విమాన సర్వీసులను ప్రారంభించడానికి ప్రణాళికలు 
  • కేంద్ర మార్గదర్శకాలను పాటిస్తూ విమాన సర్వీసులు

లాక్‌డౌన్‌ సడలింపులు ఇస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవలే దేశీయ విమాన సేవలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ విమాన సర్వీసులను కూడా తిరిగి ప్రారంభించడానికి ప్రణాళికలు వేసుకుంటోంది. వచ్చేనెల నుంచి విదేశాలకు విమాన సేవలు మళ్లీ ప్రారంభించే అవకాశముందని విమానయాన శాఖ వర్గాలు తెలిపాయి.

కేంద్ర ప్రభుత్వం ప్రకటించే మార్గదర్శకాలను పాటిస్తూ విమాన సర్వీసులను మళ్లీ ప్రారంభించనున్నారు. కాగా, కరోనా లాక్‌డౌన్‌తో విమానయాన రంగం కుదేలైపోయింది. విదేశాల నుంచి భారతీయులను తీసుకురావడానికి మాత్రం కేంద్ర ప్రభుత్వం మొదట ఎయిర్ ఇండియా, ఆ తర్వాత ప్రైవేటు విమానయాన సంస్థలకు అనుమతులు ఇచ్చింది.

India
Rajiv Gandhi International Airport
Lockdown
  • Loading...

More Telugu News