Virata Parvam: 'విరాట పర్వం' నుంచి 'కామ్రేడ్ భారతక్క' లుక్ విడుదల!

Comred Bharatakka First Look from Virataparvam

  • కామ్రేడ్ భారతక్క పాత్రలో ప్రియమణి
  • నేడు ప్రియమణి పుట్టిన రోజు
  • ఫస్ట్ లుక్ విడుదల చేసిన రానా

రానా హీరోగా, సాయి పల్లవి హీరోయిన్ గా ఉడుగుల వేణు దర్శకత్వంలో రూపొందుతున్న 'విరాట పర్వం' చిత్రం నుంచి 'కామ్రేడ్ భారతక్క' ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ సినిమాలో కీలకమైన భారతక్క పాత్రలో ప్రియమణి నటిస్తుండగా, ఫస్ట్ లుక్ ను ఆమె పుట్టిన రోజు సందర్భంగా రానా ట్విట్టర్ ద్వారా పోస్టర్ ను విడుదల చేశారు.

"మహాసంక్షోభం కూడా గొప్ప శాంతికి దారి తీస్తుందని ఆమె నమ్మింది. ఫ్రెంచ్ విప్లవంలో విద్యార్థుల పాత్ర ఎంత కీలకమో ఈ సినిమాలో కామ్రేడ్ భారతక్క పాత్ర కూడా అంతే కీలకం" అని రానా పేర్కొన్నారు. ఈ పోస్టర్ లో ప్రియమణి బ్లాక్ డ్రస్ లో భుజానికి తుపాకితో నక్సలైట్ గా కనిపిస్తోంది. 

Virata Parvam
Priyamani
Comred Bharatakka
First Look
Rana
  • Loading...

More Telugu News