Andhra Pradesh: సీఆర్‌డీఏ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మాధురి అరెస్ట్.. 14 రోజుల రిమాండ్!

CRDA Nekkallu Deputy Collector Madhuri Arrested
  • ల్యాండ్ పూలింగ్ సందర్భంగా 3.11 ఎకరాలు ఇచ్చినట్టు చూపిన రావెల గోపాలకృష్ణ
  • ప్రతిగా 10 ప్లాట్లు కేటాయించిన సీఆర్‌డీఏ
  • తప్పుడు తేదీలతో నకిలీ రికార్డులు సృష్టించినట్టు డిప్యూటీ కలెక్టర్‌పై ఆరోపణలు
తప్పుడు తేదీలతో నకిలీ రికార్డులు సృష్టించారన్న ఆరోపణలపై సీఆర్‌డీఏ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కనికెళ్ల మాధురిని విజయవాడలోని ఆమె ఇంటి వద్ద పోలీసులు నిన్న అరెస్ట్ చేశారు. అనంతరం గుంటూరు జిల్లా మంగళగిరి జూనియర్ అడిషనల్ సివిల్ జడ్జి వీవీఎస్ఎన్ లక్ష్మి ఎదుట హాజరు పరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. టీడీపీ హయాంలో రాజధాని నిర్మాణం కోసం ల్యాండ్ పూలింగ్ చేపట్టారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకుడైన రావెల గోపాలకృష్ణ 3.11 ఎకరాలను ల్యాండ్ పూలింగ్‌కు ఇచ్చినట్టు చూపించారు.

ఇందుకు ప్రతిగా 3,100 చదరపు గజాలు కలిగిన 8 నివాస ప్లాట్లు, 770 చదరపు గజాలు కలిగిన రెండు వాణిజ్య ప్లాట్లను సీఆర్‌డీఏ ద్వారా కేటాయించారు. అలాగే, రూ. 5.26 లక్షల కౌలు చెల్లించారు. నిజానికి రికార్డులలో వీరు చూపిన ఆ భూమి నాగార్జున సాగర్ రెండు రోడ్లకు చెందినది. చేసిన తప్పులు సరిదిద్దుకునేందుకు డిప్యూటీ కలెక్టర్ మాధురి తప్పుడు తేదీలతో నకిలీ రికార్డులు సృష్టించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.
Andhra Pradesh
CRDA
Deputy Collector
nekkallu

More Telugu News