Saaho: సినీ పరిశ్రమలో మరో పెళ్లి.. లవ్ మ్యారేజ్ చేసుకోబోతున్న 'సాహో' డైరెక్టర్

Saaho director Sujith to marry his girl friend

  • టాలీవుడ్ లో వరుసగా మోగుతున్న పెళ్లి బాజాలు
  • ప్రవల్లిక అనే అమ్మాయిని ప్రేమిస్తున్న సుజిత్
  • పెళ్లికి ఇరు కుటుంబాల అంగీకారం

తెలుగు సినీ పరిశ్రమలో వరుసగా పెళ్లి బాజాలు మోగుతున్నాయి. నిర్మాత దిల్ రాజు రెండో పెళ్లి చేసుకోగా, హీరో నిఖిల్ ఒక ఇంటివాడు అయ్యాడు. హీరోలు నితిన్, రానాల పెళ్లి త్వరలోనే జరగబోతోంది. ఇప్పుడు మరో సినీ ప్రముఖుడు పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు. ప్రభాస్ తో భారీ బడ్జెట్ తో 'సాహో' చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ సుజిత్ పెళ్లి చేసుకోబోతున్నాడు. ప్రవల్లిక అనే అమ్మాయిని సుజిత్ చాలా కాలంగా ప్రేమిస్తున్నాడు. పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించాయి. ఈనెల 10న వీరి ఎంగేజ్ మెంట్ జరగనున్నట్టు తెలుస్తోంది.

Saaho
Sujith
Marriage
Love
Bollywood
Tollywood
  • Loading...

More Telugu News