Simran: 'చంద్రముఖి' సీక్వెల్ లో నటించడంపై సిమ్రాన్ క్లారిటీ!

Simran gives clarity about Chandramukhi sequel

  • రజనీకాంత్ హీరోగా వచ్చిన 'చంద్రముఖి'
  • లారెన్స్ హీరోగా సీక్వెల్ కి సన్నాహాలు 
  • టైటిల్ రోల్ లో సిమ్రాన్ అంటూ ప్రచారం
  • పూర్తి అవాస్తవమంటూ ఖండన

రజనీకాంత్ హీరోగా గతంలో వచ్చిన 'చంద్రముఖి' సినిమా అప్పట్లో పెద్ద హిట్. పి.వాసు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం హారర్ చిత్రాలలో కొత్తతరహా చిత్రంగా నిలిచింది. ఇక ఇందులో చంద్రముఖి పాత్రలో జ్యోతిక అభినయం అద్భుతం అనే చెప్పాలి. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడీ చిత్రానికి దర్శకుడు వాసు సీక్వెల్ చేస్తున్నారు. ఇందులో రజనీకాంత్ పాత్రను లారెన్స్ పోషిస్తున్నాడు. చంద్రముఖిగా ఒకప్పటి గ్లామర్ క్వీన్ సిమ్రాన్ నటిస్తుందంటూ ప్రచారం జరుగుతోంది.

అయితే, తాజాగా దీనిపై సిమ్రాన్ స్పందించింది. ఈ వార్త పూర్తిగా అవాస్తవమని చెప్పింది. 'అభిమానులను నిరాశకు గురి చేస్తున్నందుకు క్షమించండి.. ఇందులో నేను నటించడం లేదు. అసలు ఈ పాత్ర చేయమంటూ ఇంతవరకూ నన్నెవరూ అడగలేదు కూడా. ఇలాంటివి ప్రచురించేముందు మా నుంచి స్పష్టత తీసుకుంటే మంచిది' అంటూ సిమ్రాన్ చెప్పుకొచ్చింది.

Simran
Rajanikanth
Jyothika
Chandramukhi
  • Loading...

More Telugu News