Ilayaraja: ఇళయరాజాకు సూపర్బ్ బర్త్ డే గిఫ్ట్ పంపిన వైజయంతీ మూవీస్!

Special Gift for Ilayaraja from Vaijayanthi Movies

  • పలు పాటలు పాడిన ప్రముఖ గాయనీ గాయకులు
  • కరోనా యోధులకు సెల్యూట్ చేస్తూ పాట
  • వైరల్ అవుతున్న వీడియో

దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజా బర్త్ డే సందర్భంగా వైజయంతీ మూవీస్ మంచి బహుమతిని పంపించింది. ఆయన సంగీత దర్శకత్వం వహించిన వివిధ చిత్రాల్లోని పాటలను ప్రముఖ గాయనీ గాయకులతో పాడించి, ఆ వీడియోను పంపింది.

దీనికి వివిధ సందర్భాల్లో ఇళయరాజా మాట్లాడిన మాటలను కూడా జోడించింది. గాయనీ గాయకులు సునీత, చిన్మయి శ్రీపాద, గౌతమ్ భరద్వాజ్, అనురాగ్ కులకర్ణి, సింధూరీ విశాల్ తదితరులు ఈ వీడియోలో పాటలు పాడారు. ఇక దీనిలోనే కరోనా వైరస్ ను అరికట్టేందుకు ముందుండి పోరాడుతున్న డాక్టర్లు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులకు సెల్యూట్ చేస్తూ, "జగదేక వీరుడు అతిలోక సుందరి" సినిమాలోని "జై చిరంజీవా... జగదేకవీరా..."  పాటలోని "ఆరోగ్య దాతా, అభయ ప్రదాతా..." చరణాన్ని జోడించడం అలరించింది. ఓ ప్రేమా..., స్వాతి చినుకు సందెవేళలో... వంటి పాటలు కూడా వినిపిస్తాయి.   ఈ వీడియోను మీరూ చూడవచ్చు. 

  • Error fetching data: Network response was not ok

More Telugu News