AAI: ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఉద్యోగులు నలుగురికి కరోనా... రాజీవ్ గాంధీ భవన్ మూసివేత

Four AAI employs tested corona positive in Delhi
  • ఢిల్లీలో కరోనా విజృంభణ
  • రెండ్రోజుల పాటు రాజీవ్ గాంధీ భవన్ శానిటైజేషన్
  • కరోనా సోకిన ఉద్యోగులను ఆసుపత్రికి తరలించిన అధికారులు
ఢిల్లీలో కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. తాజాగా ఎయిర్ పోర్ట్స్ అథారిటీకి చెందిన నలుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దాంతో ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) కేంద్ర కార్యాలయం రాజీవ్ గాంధీ భవన్ ను మూసివేశారు. రెండ్రోజుల పాటు మూసివేసి పూర్తిగా శానిటైజేషన్ నిర్వహించనున్నారు. కాగా, కరోనా సోకిన ఉద్యోగులను ఆసుపత్రికి తరలించారు. వారి కుటుంబ సభ్యులకు క్వారంటైన్ విధించినట్టు తెలుస్తోంది. ఢిల్లీలో కరోనా మహమ్మారి తీవ్రస్థాయిలో వ్యాపిస్తోంది. నిత్యం వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు వెల్లడవుతున్నాయి. ఇప్పటివరకు దేశ రాజధానిలో 19,844 కేసులు వెలుగుచూడగా, 473 మంది మృతి చెందారు.
AAI
Employs
Corona Virus
Positive
Rajiv Gandhi Bhavan
New Delhi

More Telugu News