assam: కొండచరియలు విరిగిపడడంతో 20 మంది మృతి

people killed in landslide in south Assam
  • అసోంలోని బరాక్ లోయ ప్రాంతాల్లో ఘటన
  • మరికొందరికి గాయాలు
  • ఇటీవల ఆ ప్రాంతంలో భారీ వర్షాలు
అసోంలోని బరాక్ లోయ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి దాదాపు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదాల్లో మరికొందరికి తీవ్రగాయాలయ్యాయి. ఇటీవల ఆ ప్రాంతంలో భారీ వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలోనే కొండచరియలు విరిగిపడినట్లు తెలుస్తోంది. మృతుల్లో పలు జిల్లాలకు చెందిన కూలీలు ఉన్నట్లు సమాచారం.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న సహాయక బృందాలు, పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. మృతుల్లో ఏడుగురు కచార్‌ జిల్లాకు చెందిన వారు, ఏడుగురు హైలకాండి, ఆరుగురు కరీంగంజ్ జిల్లాలకు చెందిన వారు ఉన్నారని అధికారులు చెప్పారు.
assam
landslide

More Telugu News