Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ రాష్ట్రాల నుంచి వచ్చే వారికి రైల్వే స్టేషన్‌లోనే పరీక్షలు!

AP govt decided to test railway passengers who came from six states

  • ఆరు రాష్ట్రాల నుంచి వచ్చే వారికి స్టేషన్‌లోనే పరీక్షలు
  • వారం రోజుల ప్రభుత్వ క్వారంటైన్, వారం రోజుల హోం క్వారంటైన్ తప్పనిసరి
  • వృద్ధులు, చిన్నారులు, గర్భిణులకు ప్రభుత్వ క్వారంటైన్ నుంచి మినహాయింపు

కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైలు సర్వీసులు తిరిగి ప్రారంభం కావడంతో రాష్ట్రంలోకి ప్రవేశించే వారిపై ఓ కన్నేయాలని నిర్ణయించింది. ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, చెన్నై నుంచి వచ్చే ప్రయాణికుల నమూనాలను రైల్వే స్టేషన్‌లోనే సేకరించాలని నిర్ణయించింది. అనంతరం వారికి ఏడు రోజుల ప్రభుత్వ క్వారంటైన్, మిగతా ఏడు రోజుల హోం క్వారంటైన్ విధించాలని నిర్ణయించింది.

60 ఏళ్లు దాటిన వృద్ధులు, పదేళ్లలోపు చిన్నారులు, గర్భిణులు, బాలింతలు, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మాత్రం మినహాయింపు ఇచ్చింది. అయితే, వారు తప్పకుండా 14 రోజులపాటు హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. మరోవైపు, ప్రభుత్వాధికారులు, వ్యాపారులు, వైద్యులు ప్రభుత్వ క్వారంటైన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా మినహాయింపు ఇచ్చింది.

రాష్ట్రంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణించే వారిలో కరోనా లక్షణాలు లేకుంటే క్వారంటైన్ అవసరం లేదని పేర్కొన్న ప్రభుత్వం.. హైదరాబాద్ నుంచి వచ్చే ప్రయాణికుల్లో ప్రతి బోగీలో 5 శాతం మంది నుంచి ర్యాండమ్ పద్ధతిలో నమూనాలు సేకరించాలని అధికారులను ఆదేశించింది.

  • Loading...

More Telugu News