Balakrishna: నాగబాబు వ్యాఖ్యలపై స్పందించమంటే... బాలకృష్ణ జవాబు ఇదిగో!

Balakrishna responds on Nagababu comments

  • ఇటీవల బాలకృష్ణపై నాగబాబు వ్యాఖ్యలు
  • అన్నీ అతడే మాట్లాడుతున్నాడన్న బాలయ్య
  • ఇండస్ట్రీ మొత్తం నాకే సపోర్ట్ చేస్తోంది అంటూ బాలయ్య ధీమా

ఇటీవల టాలీవుడ్ పెద్దలు తెలంగాణ ప్రభుత్వంతో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సమావేశాలకు నందమూరి బాలకృష్ణను ఆహ్వానించకపోవడంతో వివాదం రూపుదాల్చింది. ఈ విషయంలో బాలయ్య కొన్ని వ్యాఖ్యలు చేయగా, దానికి నాగబాబు ప్రతిస్పందించి మరికొన్ని వ్యాఖ్యలు చేశారు.

ఈ విషయమై తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాలయ్యను యాంకర్ ప్రశ్నించింది. నాగబాబు వ్యాఖ్యలపై ఏమంటారని అడగ్గా... "ఛీ, ఛీ... నేనేమంటాను, అన్నీ ఆయనే మాట్లాడుతున్నాడు కదా. నేను అస్సలు స్పందించను. ఇవాళ ఇండస్ట్రీ మొత్తం నాకు సపోర్ట్ గా నిలుస్తోంది. అలాంటప్పుడు నేనెందుకు మాట్లాడాలి?" అంటూ బదులిచ్చారు.

Balakrishna
Nagababu
Comments
Tollywood
Telangana
Lockdown
  • Loading...

More Telugu News