Budda Venkanna: పగోడికి కూడా ఇంత కష్టం రాకూడదు: బుద్ధా వెంకన్న

Budda comments on opposition party leader
  • నిన్నొగ్గేసి ఢిల్లీ వెళ్లిపోతున్నాడంటూ వ్యాఖ్యలు
  • గ్రామీణ యాసలో వ్యంగ్యం కురిపించిన బుద్ధా
  • అప్రూవర్ గా మారే సమయం వచ్చిందంటూ ట్వీట్
వైసీపీకి చెందిన ఓ అగ్రనేతపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న పరోక్ష వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ఢిల్లీ టూర్ వెళుతున్న నేపథ్యంలో బుద్ధా ఈ వ్యాఖ్యలు చేసినట్టు అర్థమవుతోంది. "కారు దింపేసి ఒగ్గేసినాడు, నిన్ను ఒగ్గేసి ఢిల్లీ వెళ్లిపోతాండు" అంటూ పల్లెటూరి యాసలో వ్యంగ్యం ప్రదర్శించారు. పగోడికి కూడా ఇంత కష్టం రాకూడదంటూ ఎత్తిపొడిచారు.

అయినా, "కష్టం మనుషులకు రాకపోతే పశువులకు వస్తుందా? అప్రూవర్ గా మారే సమయం దగ్గరపడింది, లేకపోతే బాత్రూం సీన్ సిద్ధంగా ఉంది" అంటూ వ్యాఖ్యానించారు. కాగా, మరోపక్క, తనపై దుష్ప్రచారం జరుగుతోందని, సీఎం జగన్ తనను ఎప్పుడూ పక్కనబెట్టరని  వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేయడం విశేషం.
Budda Venkanna
Telugudesam
YSRCP
New Delhi
Andhra Pradesh

More Telugu News