Varla Ramaiah: జూన్ నుంచి పేదవారి పింఛను రూ.2,500 ఇవ్వాలికదా... ఇవ్వరేంటి?: వర్ల

Varla Ramaiah questions CM Jagan over pensions

  • సీఎం జగన్ కు వర్ల రామయ్య సూటి ప్రశ్న
  • మాట తప్పారా, మడమ తిప్పారా అంటూ ట్వీట్
  • ప్రజాపాలన మంటగలుపుతారా? అంటూ ఆగ్రహం

టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఏపీ సీఎం జగన్ కు మరోసారి సూటి ప్రశ్న సంధించారు. సీఎం గారూ, మీరిచ్చిన హామీ ప్రకారం జూన్ నుంచి పేదవారి పింఛను రూ.2,500 ఇవ్వాలి కదా, ఇంకా ఇవ్వరేంటి? అని ప్రశ్నించారు. మాట తప్పారా లేక మడమ తిప్పారా? అంటూ నిలదీశారు. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలి వ్యవస్థల మీద కక్షగడతారా? ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ రాజ్యాంగాన్ని ధిక్కరిస్తారా? ప్రజాపాలన మంటగలుపుతారా? అంటూ మండిపడ్డారు.

Varla Ramaiah
Jagan
Pensions
Poor
Andhra Pradesh
  • Loading...

More Telugu News