Kanna Lakshminarayana: సీఎం జగన్ అసలు రూపం బయటపడింది: కన్నా లక్ష్మీనారాయణ

kanna laxminarayana fire on ap govt

  • రాష్ట్రంలో మద్యం ఏరులైపారింది
  • పనుల్లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు
  • సీఎం జగన్‌కు ఏమీ పట్టట్లేదు
  • ఒక్క అవకాశమంటూ అధికారంలోకి వచ్చారు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపైనా, సీఎం జగన్ విధానాలపైనా బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో మద్యం ఏరులైపారిందని ఆయన చెప్పారు. జనం పనుల్లేక ఇబ్బందులు పడుతుంటే సీఎం జగన్‌కు పట్టట్లేదని ఆయన చెప్పారు. ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపితే కేసులు పెడుతున్నారని విమర్శించారు.

అప్రజాస్వామిక పనులను ప్రశ్నించకూడదా? అని కన్నా లక్ష్మీ నారాయణ ప్రశ్నించారు. రాష్ట్రంలో అప్రజాస్వామికం నడుస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాదిలో చేపట్టిన నీటి ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేయాలని, ఏడాది కాలంగా పోలవరాన్ని పట్టించుకోలేదని ఆయన విమర్శించారు.

మూడు రాజధానుల పేరుతో వైసీపీ నేతలు రాజకీయం చేస్తున్నారని కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. రోజులు గడుస్తున్న కొద్దీ జగన్ అసలు రూపం బయటపడిందని, ఒక్క అవకాశమంటూ అధికారంలోకి వచ్చిన ఆయన ఇప్పుడు తన నిజస్వరూపాన్ని చూపుతున్నారని విమర్శించారు.

Kanna Lakshminarayana
BJP
Andhra Pradesh
  • Loading...

More Telugu News