Mahesh Babu: రాజమౌళితో సినిమా, 'సర్కారు వారి పాట'లో హీరోయిన్... మహేశ్ బాబు సమాధానాలివి!

Mahesh babu Intresting Answers to Fans
  • నిన్న నిరాడంబరంగా కృష్ణ బర్త్ డే
  • ఫ్యాన్స్ తో మహేశ్ చిట్ చాట్
  • పలు ప్రశ్నలకు సమాధానాలు
తన తండ్రి, సూపర్ కృష్ణ పుట్టిన రోజు నిన్న నిరాడంబరంగా జరుగగా, టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు తన ఫ్యాన్స్ తో ఆన్ లైన్ మాధ్యమంగా చిట్ చాట్ చేసిన సంగతి తెలిసిందే. అభిమానులు అడుగుతున్న పలు చిలిపి ప్రశ్నలకు మహేశ్ తనదైన స్టయిల్ లో సమాధానాలు చెప్పారు.

మహేశ్ తాజా చిత్రం 'సర్కారు వారి పాట'లో హీరోయిన్ ఎవరని ఓ అభిమాని అడుగగా, "ఎవరైతే బావుంటారో నువ్వే చెప్పు" అంటూ ఎదురు ప్రశ్నించారు. వర్షం పడుతున్న విషయాన్ని ప్రస్తావించిన మరో అభిమాని, ఈ సమయంలో ఏం స్నాక్స్‌ తింటే బావుంటుందని అడుగగా, "మిర్చి బజ్జీ, అల్లం టీ" బాగుంటాయని చెప్పారు.

దిగ్గజ దర్శకుడు రాజమౌళితో సినిమా ఎప్పుడు ఉంటుందని మరో అభిమాని అడుగగా, "కచ్చితంగా ఉంటుంది" అని మాత్రమే వ్యాఖ్యానించి తప్పించుకున్నారు. లాక్ డౌన్ లో ఏ పుస్తకాలు చదివారన్న ప్రశ్నకు, 'ప్రస్తుతం సేపియన్స్ బుక్ చదువుతున్నానని' మహేశ్ వ్యాఖ్యానించారు. తనకు ఇష్టమైన మార్వెల్ సూపర్ హీరోల్లో ఐరన్ మేన్ హల్క్ ఉన్నారని, మంచి నటుడిగా, తన పిల్లలకు గొప్ప తండ్రిగా, భార్యకు గొప్ప భర్తగా ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.
Mahesh Babu
Krishna
Rajamouli
Sarkaru Vari Paata

More Telugu News