Hyderabad: హైదరాబాద్ లో వర్షం... నగరజీవులకు ఉపశమనం!

Rain lashes some places in Hyderabad

  • కొన్నిరోజులుగా హైదరాబాద్ లో మండుటెండలు
  • ఈ మధ్యాహ్నం పలు ప్రాంతాల్లో వర్షం
  • తగ్గిన ఉష్ణోగ్రత... నగరంలో ఆహ్లాదకర వాతావరణం

గత కొన్నిరోజులుగా అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో అల్లాడిన హైదరాబాద్ వాసులకు ఊరట కలిగిస్తూ నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. మండే ఎండలతో ఉక్కిరిబిక్కిరైన భాగ్యనగరంపై వరుణుడు కరుణ చూపాడు.

ఈసీఐఎల్, నల్లకుంట, నాగోల్, వనస్థలిపురం, ఎల్బీనగర్, కూకట్ పల్లి, హయత్ నగర్, మల్కాజ్ పేట, దిల్ సుఖ్ నగర్, కొత్తపేట, సరూర్ నగర్, నేరేడ్ మెట్ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. కొన్నిగంటల ముందు నుంచే మబ్బులు పట్టి వాతావరణం చల్లగా మారడంతో నగర వాసులు ఉపశమనం పొందారు. ఆపై వర్షం కురవడంతో ఉష్ణోగ్రతలు మరింత తగ్గాయి.

Hyderabad
Rain
Heat
Summer
  • Loading...

More Telugu News