Corona Virus: కరోనా వ్యాక్సిన్‌కు ఇంకా నాలుగేళ్లు ఆగాల్సిందే: కిరణ్ మజుందార్ షా

Covid 19 Vaccine will take long time to be ready

  • ఏడాదిలోపు వ్యాక్సిన్ అంటే కష్టమే
  • సురక్షితమైన టీకాను అభివృద్ధి చేయాలంటే చాలా ఏళ్లు పడుతుంది
  • టీకా వచ్చే వరకు జాగ్రత్తగా ఉండాలి

త్వరలోనే కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందన్న ఆశలపై బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్ పర్సన్ కిరణ్ మజుందార్ షా నీళ్లు చల్లారు. ఇప్పుడప్పుడే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాల్లేవని, కనీసం నాలుగేళ్లు ఆగాల్సిందేనని స్పష్టం చేశారు. అప్పటి వరకు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సురక్షితమైన వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి చాలా కాలం పట్టే అవకాశం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.

ఏడాదిలోపే టీకాను అభివృద్ధి చేయడం అనేది చాలా కష్టసాధ్యమైన పనేనని అన్నారు. వ్యాక్సిన్‌‌కు భద్రత, తగినంత సామర్థ్యం ఉండాలంటే పలు ప్రక్రియలు అవసరమని కిరణ్ మజుందార్ షా పేర్కొన్నారు. కాబట్టి నమ్మకమైన వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేంత వరకు చాలా జాగ్రత్తగా ఉండాలని అన్నారు. అలాగే, ఆరోగ్య సంరక్షణపై మరిన్ని పెట్టుబడులు పెట్టాల్సిన అవసరాన్ని కరోనా మనకు నొక్కి చెబుతోందన్నారు.

  • Loading...

More Telugu News