Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీలో అగ్నిప్రమాదం.. ఫర్నిచర్ దగ్ధం

Fire Accident in Basara IIIT

  • మంటలు అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది
  • క్యాంపస్ మొత్తం కమ్మేసిన పొగ
  • టేబుళ్లు, కుర్చీలు, ప్రొజెక్టర్ దగ్ధం

నిర్మల్ జిల్లా బాసరలోని ట్రిపుల్ ఐటీలో ఈ ఉదయం జరిగిన అగ్నిప్రమాదంలో ఫర్నిచర్ దగ్ధమైంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సహాయక కార్యక్రమాలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేస్తున్నారు.  

అకడమిక్‌ బ్లాక్‌ ఏబీ 1 క్లాస్‌రూమ్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ జరగడంతో మంటలు చెలరేగి విస్తరించాయి. దీంతో క్యాంపస్ మొత్తం పొగతో నిండిపోయింది. ఈ ప్రమాదంలో క్లాస్‌రూమ్‌లోని ఫర్నిచర్‌, ప్రొజెక్టర్‌, 70 కుర్చీలు, 21 టేబుళ్లు పూర్తిగా  కాలి బూడిదయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.

Basara IIIT
Nirmal District
Fire Accident
  • Loading...

More Telugu News