America: అమెరికాలో ఆర్థిక వ్యవస్థ తెరుచుకున్నా.. పెరుగుతూనే వున్న నిరుద్యోగం!

Unemployment In America raised

  • ఏప్రిల్‌లో 14.7 శాతానికి అమెరికాలో నిరుద్యోగిత
  • నిరుద్యోగ భృతి కోసం 4.1 కోట్ల మంది దరఖాస్తు
  • షట్‌డౌన్ తర్వాత తిరిగి ఉద్యోగులను నియమించుకుంటున్న కంపెనీలు

కరోనా దెబ్బకు కకావికలైన అమెరికాలో నిరుద్యోగిత అమాంతం పెరిగిపోతోంది. కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డునపడుతున్నారు. లాక్‌డౌన్ తర్వాత అమెరికా ఆర్థిక వ్యవస్థ తిరిగి తెరుచుకున్నప్పటికీ ఉద్యోగాల కోతలు మాత్రం ఆగడం లేదు.

 ఆర్థిక నష్టాలను పూడ్చుకునేందుకు ప్రముఖ కంపెనీలన్నీ ఉద్యోగులను ఇళ్లకు పంపుతున్నాయి. ఉద్యోగాలు కోల్పోయిన వారు నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. గత వారం రోజుల్లో కొత్తగా 21 లక్షల మందికిపైగా ప్రభుత్వ ప్రయోజనాల కోసం దరఖాస్తు చేసుకోగా, ఇప్పటి వరకు ఇలా దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 4.1 కోట్లకు చేరింది. మహా మాంద్యం తర్వాత తొలిసారి ఏప్రిల్‌లో అమెరికాలో నిరుద్యోగిత రేటు 14.7 శాతానికి చేరగా, ఈ నెలలో అది 20 శాతానికి చేరుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

అయితే, నిరుద్యోగులకు కొంత ఊరటనిచ్చే విషయం ఏమిటంటే.. లాక్‌డౌన్ తర్వాత తెరుచుకుంటున్న కంపెనీలు తిరిగి ఉద్యోగులను నియమించుకుంటుండడం. అమెరికా లేబర్ డిపార్ట్‌మెంట్ ఈ విషయాన్ని వెల్లడించింది. కరోనా విజృంభణ అధికంగా ఉన్న సమయంలో 2.5 కోట్ల మంది నిరుద్యోగ భృతి పొందారని, ప్రస్తుతం ఇది 2.1 కోట్లకు దిగిందని పేర్కొంది. అయితే, ఉద్యోగాలు కోల్పోయిన వారిలో చాలామంది తిరిగి కంపెనీలకు వచ్చే అవకాశం లేదన్న వాదన కూడా ఉంది.

  • Loading...

More Telugu News