Kamineni Srinivas: ఎస్‌ఈసీగా రమేశ్‌కుమార్‌ను తిరిగి నియమించాలన్న హైకోర్టు తీర్పుపై పిటిషనర్ కామినేని శ్రీనివాస్ స్పందన

kamineni on high court

  • ప్రభుత్వం చేసింది రాజ్యాంగ ఉల్లంఘనే
  • జేడీ నడ్డా అనుమతితోనే పిటిషన్ వేశా
  • కరోనా నేపథ్యంలో ఎస్ఈసీ ఎన్నికలు వాయిదా వేశారు
  • ఎవరైనా ఏదైనా చేసినప్పుడు ఇకనైనా జగన్ పాజిటివ్‌ గా తీసుకోవాలి

ఎస్‌ఈసీ విషయంలో నిబంధనలు మారుస్తూ ఏపీ ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌ను  హైకోర్టు కొట్టేసిన విషయం తెలిసిందే. రమేశ్ కుమార్‌ను తిరిగి నియమించాలని కోర్టు కీలక ఆదేశాలు జారీ చేయడం పట్ల పిటిషనర్ రాష్ట్ర మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌ స్పందించారు. కోర్టు ప్రాంగణంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం చేసింది రాజ్యాంగ ఉల్లంఘనేనని చెప్పారు. తాను తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేడీ నడ్డా అనుమతితోనే పిటిషన్ వేశానని తెలిపారు.

కరోనా విజృంభణ జరుగుతోన్న సమయంలో ఆ విషయాన్ని తీసిపారేస్తూ ఏపీ ప్రభుత్వం మొదట్లో వ్యవహరించిన తీరు తీవ్ర అభ్యంతరంగా ఉందని కామినేని తెలిపారు. కరోనా నేపథ్యంలో ఎస్ఈసీ ఎన్నికలు వాయిదా వేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన సమర్థించారు. ఎవరైనా ఏదైనా చేసినప్పుడు ఇకనైనా పాజిటివ్‌ గా తీసుకోవాలని ఆయన సీఎం జగన్‌కు విజ్ఞప్తి చేశారు.

Kamineni Srinivas
Andhra Pradesh
High Court
  • Loading...

More Telugu News