AP High Court: టీటీడీ ఆస్తుల అమ్మకంపై హైకోర్టులో తదుపరి విచారణ 3 వారాలకు వాయిదా
- టీటీడీ ఆస్తుల అమ్మకంపై హైకోర్టులో విచారణ
- పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది బాలాజీ
- ఆస్తుల అమ్మకం చట్టవిరుద్ధమన్న న్యాయవాది
టీటీడీ ఆస్తుల అమ్మకం వ్యవహారం హైకోర్టు ముంగిట చేరింది. శ్రీవారి ఆస్తుల అమ్మకాన్ని వ్యతిరేకిస్తూ న్యాయవాది బాలాజీ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు నేడు విచారణ చేపట్టింది.
టీటీడీ ఆస్తులను వేలం వేయడం చట్టవిరుద్ధమని న్యాయవాది బాలాజీ స్పష్టం చేశారు. భవిష్యత్తులో టీటీడీ ఆస్తులు విక్రయించకుండా చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని కోరారు. టీటీడీ ఆస్తుల వివరాలను అధికారిక వెబ్ సైట్ లో పెట్టాలని విన్నవించారు. వాదనలు విన్న అనంతరం తదుపరి విచారణ మూడు వారాలకు వాయిదా వేస్తున్నట్టు హైకోర్టు పేర్కొంది.
కాగా, టీటీడీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు డాక్టర్ మజ్జి సూరిబాబు టీటీడీ ఆస్తులు వేలం వేయట్లేదని కోర్టుకు వివరించారు. టీటీడీ ఆస్తుల వివరాలను, టీటీడీ నిర్ణయాలను ఆయన హైకోర్టుకు వివరించారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం సమగ్ర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆయనకు సూచించింది.