ICC T20: టీ20 వరల్డ్ కప్ ను వాయిదా వేస్తూ ఐసీసీ నిర్ణయం?

ICC decides to postpone T20 world cup

  • ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరగాల్సిన టోర్నీ
  • కరోనా కారణంగా నిలిచిపోయిన వీసా ప్రక్రియ
  • టోర్నీని నిర్వహించేందుకు కనిపించని అవకాశాలు

అంతా ఊహించినట్టే జరిగింది. ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది జరగాల్సిన టీ20 ప్రపంచకప్ టోర్నీ వాయిదాపడినట్టు వార్తలు వెలువడుతున్నాయి. దీనికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ... ఇది నిజమేనని ఐసీసీ వర్గాలు చెపుతున్నాయి.

 రేపు అన్ని దేశాల క్రికెట్ బోర్డులతో జరిగే సమావేశంలో దీనిపై తుది నిర్ణయం వెలువరించే అవకాశం ఉంది. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 18 నుంచి టీ20 వరల్డ్ కప్ ఆస్ట్రేలియాలో జరగాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా వీసాల ప్రక్రియను ఆ దేశం ఆపేసింది. పర్యాటక వీసాలను సైతం రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పట్లో టోర్నీ జరిపేందుకు అనువైన పరిస్థితులు నెలకొనే అవకాశాలు లేకపోవడంతో.. టోర్నీని వాయిదా వేయనున్నారు.

ICC T20
Postpone
  • Loading...

More Telugu News