Junior NTR: రేపు ఎన్టీఆర్ ఘాట్ కు వెళ్లకూడదని జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ నిర్ణయం!

Junior NTR not visiting NTR Ghat tomorrow

  • రేపు దివంగత ఎన్టీఆర్ జయంతి
  • కరోనా నేపథ్యంలో ఘాట్ కు వెళ్లకూడదని తారక్, కల్యాణ్ రామ్ నిర్ణయం
  • ఇంటి వద్ద నుంచే తాతకు నివాళి అర్పించనున్న వైనం

రేపు (మే 28) దివంగత ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ జయంతి. ఈ సందర్భంగా ప్రతి ఏటా టీడీపీ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. మరోవైపు, జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులందరూ హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ ను సందర్శించి, నివాళి అర్పించడం ఆనవాయతీగా వస్తోంది.

అయితే రేపు ఎన్టీఆర్ ఘాట్ ను జూనియర్ ఎన్టీఆర్, ఆయన సోదరుడు కల్యాణ్ రామ్ సందర్శించడం లేదు. ఇంటి వద్ద నుంచే తమ తాతగారికి వారు నివాళి అర్పించనున్నారు. కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ నిబంధనలు అమల్లో ఉన్న నేపథ్యంలో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. తాము ఘాట్ వద్దకు వస్తే అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడ గుమికూడే అవకాశం ఉన్న నేపథ్యంలో, వారు రేపు ఘాట్ కు రాకూడదని నిర్ణయించుకున్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News