Japan: భారతీయులపై జపాన్ ట్రావెల్ బ్యాన్!

Japan Travel ban on India

  • ఇండియాతో పాటు 10 దేశాలపై నిషేధం
  • మొత్తం 111 దేశాల వాసులను నిషేధించిన జపాన్
  • తక్షణం అమలులోకి వస్తాయన్న షింజో అబే

ఇండియాలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతూ, దాదాపు లక్షన్నర స్థాయికి చేరుకున్న తరుణంలో భారతీయులు ఎవరినీ తమ దేశంలోకి అడుగు పెట్టనీయకుండా జపాన్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ తో పాటు కొవిడ్ కేసులు అధికంగా ఉన్న పది దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధిస్తున్నట్టు ప్రకటించింది. తక్షణమే ఈ ఆదేశాలు అమలులోకి వస్తాయని జపాన్ ప్రధాని షింజో అబే తెలియజేశారు. ఇప్పటికే జపాన్ సుమారు 101 దేశాల ప్రజలపై నిషేధాన్ని విధించగా, తాజా నిర్ణయంతో ఆ సంఖ్య 111కు చేరింది.

తాజాగా ఇండియాతో పాటు ఆఫ్ఘనిస్తాన్, అర్జెంటీనా, బంగ్లాదేశ్, ఎల్ శాల్వడార్, ఘనా, గ్వినియా, కిర్గిస్థాన్, పాకిస్థాన్, సౌత్ ఆఫ్రికా, తజికిస్థాన్ దేశాలపై జపాన్ ఆంక్షలు పెట్టింది. ఇదే సమయంలో సరిహద్దుల వద్ద కఠిన ఆంక్షలను అమలు చేయనున్నామని, జూన్ నెల ముగిసేంత వరకూ జపాన్ లో అడుగు పెట్టే ప్రతి ఒక్కరినీ రెండు వారాల పాటు క్వారంటైన్ చేస్తామని షింజో అబే వెల్లడించారు. కాగా, జపాన్ లో ఇంతవరకూ 16,628 మందికి వైరస్ సోకగా, 851 మరణించారు. 13,600 మందికి పైగా కోలుకున్నారు.

Japan
India
Indians
Travel Ban
  • Loading...

More Telugu News