RoJA: డిప్యూటీ సీఎం నారాయణస్వామి తీరుపై మండిపడ్డ రోజా

Roja fires on Deputy CM Narayana Swamy
  • పుత్తూరులో పర్యటించిన నారాయణస్వామి
  • తనను పిలవకపోవడంపై రోజా ఆగ్రహం
  • ప్రొటోకాల్ పాటించలేదంటూ మండిపాటు
అధికార పార్టీ వైసీపీలో నేతల మధ్య విభేదాలు చర్చనీయాంశంగా మారాయి. డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎమ్మెల్యే రోజా మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. తనకు సమాచారం ఇవ్వకుండానే తన నియోజకర్గంలో నారాయణస్వామి పర్యటించారని రోజా మండిపడ్డారు. నియోజకర్గంలో తాను అందుబాటులోనే ఉన్నాననే విషయం తెలిసికూడా... తనను పట్టించుకోకుండా, ప్రొటోకాల్ ఉల్లంఘించారని విమర్శించారు.

వివాదం వివరాల్లోకి వెళ్తే డిప్యూటీ సీఎం నారాయణస్వామి సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, జిల్లా కలెక్టర్ భరత్ నారాయణ్ గుప్తా పుత్తూరులో పర్యటించారు. దళితులకు కల్యాణమంటపం స్థల సేకరణ కోసం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఖాళీ భూమిని పరిశీలించారు. అయితే, ఈ కార్యక్రమానికి రోజాను పిలవకపోవడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
RoJA
K Narayana Swamy
YSRCP

More Telugu News