subramanian swamy: హిందుత్వ పట్టాలు తప్పుతోందా?: సుబ్రహ్మణ్య స్వామి

subrahmaian swamy on ttd

  • టీటీడీ భూముల వేలంపై స్పందన 
  • 'ఒక క్రైస్తవ ముఖ్యమంత్రి' అంటూ పరోక్ష వ్యాఖ్య  
  • ఒక హిందూ సీఎం మాత్రం ఆలయాలన్నిటినీ తన అధీనంలోకి తీసుకున్నారు
  • తనను తాను చైర్మన్‌గా ప్రకటించుకున్నారు కదా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌పై బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి పలు వ్యాఖ్యలు చేశారు. 'తిరుపతి భూముల వేలంపై హిందువులు గట్టిగా స్పందించడంతో, ఒక క్రైస్తవ ముఖ్యమంత్రి స్పందించాడు సరే, మరి ఒక హిందూ సీఎం మాత్రం రాష్ట్రంలోని ఆలయాలన్నిటినీ తన అధీనంలోకి తీసుకుని, తనను తాను చైర్మన్‌గా ప్రకటించుకున్నారు కదా? హిందుత్వ పట్టాలు తప్పుతోందా?' అంటూ స్వామి  ప్రశ్నించారు.

కాగా, తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్తులను వేలం వేస్తామంటూ ప్రకటించిన టీటీడీ.. తీవ్ర విమర్శలు రావడంతో తాత్కాలికంగా తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. కాగా, హిందూ దేవాలయాలు ప్రభుత్వాల అధీనంలో ఉండకూడదని సుబ్రహ్మణ్య స్వామి చాలాకాలంగా వాదిస్తున్నారు. ఈ విషయంపై ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్‌ కూడా వేశారు.

subramanian swamy
BJP
TTD
  • Loading...

More Telugu News