Rakesh Sinha: ఆస్తుల అమ్మకంపై వైవీ సుబ్బారెడ్డికి లేఖ రాసిన టీటీడీ బోర్డు ప్రత్యేక ఆహ్వానితుడు రాకేశ్ సిన్హా

TTD Board member Rakesh Sinha writes TTD Chairman YV Subbareddy

  • విమర్శల పాలవుతున్న శ్రీవారి ఆస్తుల అమ్మకం
  • తమిళనాడులో ఉన్న 23 ఆస్తుల వేలానికి టీటీడీ నిర్ణయం
  • ఆస్తుల అమ్మకం నిలిపివేయాలన్న సిన్హా

దేశవ్యాప్తంగా ఉన్న తిరుమల వెంకన్న ఆస్తుల అమ్మకం నిర్ణయం విమర్శలపాలవుతోంది. తాజాగా, దీనిపై టీటీడీ బోర్డు ప్రత్యేక ఆహ్వానిత సభ్యుడు, ఎంపీ, ప్రొఫెసర్ రాకేశ్ సిన్హా స్పందించారు. టీటీడీ ఆస్తుల అమ్మకం నిర్ణయం సరికాదని హితవు పలికారు. ఈ మేరకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి లేఖ రాశారు.

స్వామివారికి భక్తులు విరాళంగా ఇచ్చిన ఆస్తులను విక్రయించడం అంటే భక్తుల మనోభావాలకు వ్యతిరేకంగా వ్యవహరించడమేనని, ఈ నిర్ణయంపై పునరాలోచన చేస్తే బాగుంటుందని సూచించారు. తమిళనాడులో ఉన్న 23 ఆస్తులను బహిరంగ వేలం ద్వారా విక్రయించి సుమారు రూ.100 కోట్ల ఆదాయం సమకూర్చుకోవాలని టీటీడీ భావించింది. అయితే ఈ నిర్ణయాన్ని టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నాయి.

  • Loading...

More Telugu News