AP High Court: అనుమతి లేకుండా ఎల్జీ పాలిమర్స్ డైరెక్టర్లు దేశం విడిచి వెళ్లొద్దు: హైకోర్టు కీలక ఆదేశాలు

High Court issues key orders in LG Polymers incident
  • ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ తో 12 మంది మృతి
  • సుమోటోగా స్వీకరించిన హైకోర్టు
  • ఎల్జీ పాలిమర్స్ ప్రాంగణాన్ని సీజ్ చేయాలని ఆదేశం
వైజాగ్ లో 12 మంది మృతికి కారణమైన ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనలో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ వ్యవహారంలో హైకోర్టు సుమోటోగా విచారణ షురూ చేసిన సంగతి తెలిసిందే.

ఇవాళ విచారణ జరిపిన అనంతరం లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేసింది. అనుమతి లేకుండా ఎల్జీ పాలిమర్స్ కంపెనీ డైరెక్టర్లు దేశం విడిచి వెళ్లరాదని స్పష్టం చేసింది. సంస్థ డైరెక్టర్లు తమ పాస్ పోర్టులను అప్పగించాలని పేర్కొంది. అంతేకాదు, విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ ప్రాంగణంలోకి ఎవరినీ అనుమతించవద్దని, ప్రాంగణాన్ని సీజ్ చేయాలని ఆదేశించింది.
AP High Court
LG Polymers
Vizag Gas Leak
Vizag
Andhra Pradesh

More Telugu News