nagababu: 'ఏడుకొండల వాడా వెంకటరమణా గోవిందా గోవిందా' అంటూ నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

nagababu about ttd

  • శ్రీవారి ఆస్తులను అమ్మానికి పెట్టడంపై స్పందన
  • ప్రజలతో పాటు నీ ఆస్తులు కూడా రక్షించుకో స్వామి అన్న నాగబాబు
  • ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామన్న ప్రతిపక్షాలు

ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఆస్తులతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తిరుమల తిరుమతి శ్రీవారి ఆస్తులను టీటీడీ అమ్మకానికి పెట్టడం పట్ల పెద్ద ఎత్తున విమర్శలు వస్తోన్న విషయం తెలిసిందే. తమిళనాడులోని పలు జిల్లాల్లో 23 చోట్ల ఉన్న ఆస్తుల వేలానికి అధికారులు సిద్ధమయ్యారు. దీనిపై జనసేన నేత నాగబాబు స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'ఏడు కొండల వాడా వెంకట రమణా.. గోవిందా గోవిందా. ప్రజలతో పాటు నీ ఆస్తులు కూడా రక్షించుకో స్వామి' అని ఆయన ట్వీట్ చేశారు.

కొన్ని రోజులుగా నాగబాబు పలు అంశాలపై స్పందిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. కాగా, ఆస్తులు వేలం వేయాలనుకుంటున్న టీటీడీ చర్యలను ప్రతిపక్ష నేతలంతా తీవ్రంగా తప్పుబడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరిస్తున్నారు.

nagababu
TTD
Tirupati
  • Error fetching data: Network response was not ok

More Telugu News