Hyderabad: ప్రేమిస్తే అంగీకరించలేదని... ప్రియుడి ఇంట్లోనే ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య!

Girl Sucide for Love Failure

  • హైదరాబాద్ లో నివాసం ఉంటున్న శ్రీకాకుళం కుటుంబం
  • పక్కింటి యువకుడిని ప్రేమించిన విద్యార్థిని
  • వయసు తేడాతో కాదనడంతో సూసైడ్

తాను ప్రేమించిన వాడు కాదంటున్నాడన్న మనస్తాపంతో అతని ఇంటికే వెళ్లి ఆత్మహత్య చేసుకుందో విద్యార్థిని. హైదరాబాద్ లోని మూసాపేటలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాల్లోకి వెళితే, శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ కుటుంబం యాదవ బస్తీలో ఉంటూ కూలిపనులు చేసుకుని జీవనం సాగిస్తోంది. వారి అమ్మాయి (17) ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. ఇంటి పక్కనే ఉంటున్న ఓ యువకుడిని (28) ప్రేమించిన ఆమె, తనను పెళ్లి చేసుకోవాలని తరచూ అతన్ని కోరుతూ ఉండగా, వయసులో తేడా అధికంగా ఉందంటూ, అతను తిరస్కరిస్తూ వచ్చాడు.

ఈ క్రమంలో శుక్రవారం మరోసారి అతని ఇంటికి వెళ్లి తనను పెళ్లి చేసుకోవాలని కోరింది. అతను మాత్రం నిరాకరించాడు. దీంతో మనస్తాపానికి గురైన విద్యార్థిని, ఆ యువకుడు ఇంట్లో నిద్రిస్తున్న వేళ, మరోసారి వెళ్లి, తన చున్నీతో సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. యువకుడు నిద్రలేచి చూసి, విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు చెప్పారు. తమ కుమార్తెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రిస్తున్నారని యువతి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా, ప్రాథమిక విచారణలో ప్రేమ విఫలం కావడం వల్లే ఆమె మరణించిందని పోలీసులు తేల్చారు. అయితే అనుమానాస్పద మృతిగా కేసును నమోదు చేసి మరింత లోతుగా దర్యాఫ్తు చేస్తున్నట్టు తెలిపారు.

Hyderabad
Sucide
Lover
Girl
  • Loading...

More Telugu News