Doctors: త్వరలో ఏపీలో 9,700 పైగా డాక్టర్లు, వైద్య సిబ్బంది ఉద్యోగాల భర్తీ: జవహర్ రెడ్డి

AP Government to recruit thousands of medical staff
  • కరోనా నియంత్రణ కోసం మరిన్ని చర్యలు
  • ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి ప్రయాణికులు
  • అదనపు బెడ్లు సిద్ధం చేస్తున్నామన్న జవహర్ రెడ్డి
  • రేపటితో కరోనా టెస్టుల సంఖ్య 3 లక్షలు దాటుతుందని వెల్లడి
ఏపీలో త్వరలోనే వైద్య విభాగాన్ని మరింత పటిష్టం చేయనున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి వెల్లడించారు. ఈ క్రమంలో 9,700 డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది ఉద్యోగాల భర్తీ చేపడుతున్నామని తెలిపారు. కరోనా నియంత్రణ కోసం మరిన్ని ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని చెప్పారు.

 ఇతర రాష్ట్రాల నుంచి ప్రయాణికులు వస్తున్నందున అదనపు బెడ్లు సిద్ధం చేస్తున్నామని వివరించారు. 8 జిల్లాల్లో 30 వేల ఐసోలేషన్ పడకలు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. 12 వేల వరకు ఆక్సిజన్ బెడ్లను సిద్ధం చేస్తున్నామని అన్నారు.  హైరిస్క్ ప్రాంతాలైన మహారాష్ట్ర, గుజరాత్ నుంచి వస్తున్న వారందరికీ పరీక్షలు చేస్తున్నట్టు జవహర్ పేర్కొన్నారు. కరోనా వైద్య పరీక్షల్లో ఏపీ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందని, రేపటికి కరోనా టెస్టుల సంఖ్య 3 లక్షలు దాటుతుందని చెప్పారు.
Doctors
Medical Staff
Andhra Pradesh
Jawahar Reddy
Corona Virus

More Telugu News