Personal Information: సైబర్ క్రిమినల్స్ చేతికి చిక్కిన 2.9 కోట్ల మంది భారతీయలు వ్యక్తిగత డేటా!
- డార్క్ వెబ్ సైట్లో ఫ్రీగా ఉంచిన దుండగులు
- ఫోన్ నంబర్లు, ఇంటి అడ్రస్ లు సహా ఆన్ లైన్లో పూర్తి వివరాలు
- ఆన్ లైన్లో వర్క్ ఎక్స్ పీరియన్స్ డీటెయిల్స్
భారత దేశ చరిత్రలో మరో అతిపెద్ద సైబర్ క్రైమ్ చోటు చేసుకుంది. దాదాపు 2.9 కోట్ల మంది వ్యక్తిగత సమాచారాన్ని డార్క్ వెబ్ సైట్లో దుండగులు ఉంచారు. ఈ మేరకు సైబల్ అనే ఆన్ లైన్ ఇంటెలిజెన్స్ సంస్థ ఈరోజు వెల్లడించింది.
'ఉద్యోగ అన్వేషణలో ఉన్న 2.9 కోట్ల మంది వివరాలను ఉచితంగా ఉంచింది. ఇలాంటి లీకులు సాధారణమైన విషయమే అయినా... ఈసారి ఒక ఆందోళన కలిగించే అంశం ఉంది. విద్య, చిరునామా వంటి వ్యక్తిగత సమాచారం కూడా చోరీ అయింది' అని సైబల్ తెలిపింది. ఈమెయిల్ ఐడీ, ఫోన్ నంబర్, వర్క్ ఎక్స్ పీరియన్స్ తదితర వివరాలను కూడా బయటపెట్టిందని చెప్పింది. ఇటీవల ఫేస్ బుక్ హ్యాక్ కు గురైన విషయాన్ని కూడా ఈ సంస్థే వెల్లడించింది.