Varun Tej: వరుణ్ తేజ్ కు కొంటె ప్రశ్న వేసిన సాయి తేజ్

Sai Tej questions Varun Tej on Marriage

  • వరుణ్, నిహారిక పెళ్లి చేయాలనుకుంటున్నామన్న నాగబాబు
  • సంబంధాలను వెతికే పనిలో ఉన్నామని వ్యాఖ్య
  • ఏంటి బావా నీకు నీకు పెళ్లంట కదా అని ప్రశ్నించిన సాయి తేజ్

లాక్ డౌన్ సమయంలో టాలీవుడ్ లో పెళ్లి బాజాలు మోగుతున్నాయి. ఇప్పటికే దిల్ రాజు, నిఖిల్, కమెడియన్ మహేశ్ లు పెళ్లి చేసుకున్నారు. లాక్ డౌన్ తర్వాత నితిన్ పెళ్లి చేసుకోబోతున్నాడు. త్వరలోనే రానా, అతని ప్రియురాలు మిహీకా బజాజ్ ల పెళ్లి ఉండబోతోంది.

ఈ నేపథ్యంలో, తన పిల్లల గురించి సినీ నటుడు నాగబాబు చేసిన ప్రకటన కూడా వైరల్ అవుతోంది. కొడుకు వరుణ్ తేజ్, కూతురు నిహారిక పెళ్లిళ్లను చేయాలనుకుంటున్నట్టు నాగబాబు తెలిపారు. ప్రస్తుతం సంబంధాలను వెతికే పనిలో ఉన్నామని చెప్పారు.

వచ్చే ఏడాది నిహారికకు పెళ్లి చేసేస్తామని... ఆ తర్వాత వరుణ్ మ్యారేజ్ కూడా చేసేస్తామని నాగబాబు తెలిపారు. మరోవైపు తన పెళ్లిపై మరో మెగా హీరో సాయి తేజ్ కూడా స్పందించాడు. 33 ఏళ్లు దాటేస్తున్నాయని... పెళ్లి తప్పదు అంటూ కామెంట్ చేశాడు. సమయం కలిసొస్తే ఈ ఏడాది ప్రేమలో పడతానేమో అంటూ మరికొంత మసాలాను జోడించాడు.    

ఈ విషయాలన్నీ పక్కన పెట్టేస్తే... తాజాగా తన బావ వరుణ్ తేజ్ ను సాయి తేజ్ ఆట పట్టించాడు. 'ఏంటి బావా... నీకు పెళ్లంట?' అంటూ కొంటె ప్రశ్న వేశాడు. దీనిపై ఇంకా వరుణ్ స్పందించాల్సి ఉంది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News