raghavendra rao: నేను జీవితాంతం గుర్తుంచుకునే సినిమా ఇది!: దర్శకుడు రాఘవేంద్రరావు

raghavendra rao on annamayya

  • ఈ రోజు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు పుట్టినరోజు
  • అన్నమయ్య సినిమా విడుదలై నిన్నటితో 23 ఏళ్లు
  • సామాజిక మాధ్యమాల్లో స్పందించిన దర్శకేంద్రుడు
  • ఈ సినిమా తీసే అవకాశం కల్పించినందుకు దేవుడికి కృతజ్ఞతలు

ఈ రోజు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు పుట్టినరోజు. మరోవైపు, ఆయన దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ సినిమా అన్నమయ్య సినిమా విడుదలై నిన్నటితో 23 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆయన సామాజిక మాధ్యమాల ద్వారా దీనిపై స్పందించారు.  23 ఏళ్ల క్రితం, తన జన్మదినోత్సవానికి ఒక రోజు ముందు తన జీవితంలో ప్రత్యేకమైన చిత్రం విడుదలైందని చెప్పారు.

తాను జీవితాంతం గుర్తుంచుకునే సినిమా అన్నమయ్య అని ఆయన తెలిపారు. అన్నమయ్య సినిమా తీసే అవకాశం కల్పించినందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్లు పేర్కొన్నారు. అన్నమయ్య  కోసం నాగార్జున, మోహన్‌బాబు, సుమన్, రమ్యకృష్ణ, కస్తూరి, కీరవాణి, భారవి, నిర్మాత దొరస్వామిరాజు బాగా కష్టపడ్డారని ఆయన చెప్పారు. ఈ చిత్రం కోసం పని చేసిన అందరికీ తాను కృతజ్ఞతలు తెలుపుతున్నానని పేర్కొన్నారు.

raghavendra rao
Nagarjuna
Tollywood
  • Loading...

More Telugu News