Donald Trump: ఆ సిరా ఇంకా ఆరకముందే ఈ వైరస్‌ వచ్చేసింది: చైనాపై ట్రంప్ మండిపాటు

trump fires on china

  • కరోనా వైరస్ చైనా నుంచే వచ్చింది
  • చాలా అసంతృప్తిగా ఉన్నాం
  • ఈ విషయాన్ని ఏ మాత్రం తేలిగ్గా తీసుకోబోం

కొవిడ్‌-19 వైరస్ విజృంభణ నేపథ్యంలో చైనాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. కరోనా వైరస్ చైనా నుంచే వచ్చిందని అన్నారు. ఈ విషయంలో తాము చాలా అసంతృప్తిగా ఉన్నామని,  ఈ మధ్యే చైనాతో ఓ ఒప్పందంపై సంతకాలు చేశామని, ఆ సిరా ఇంకా ఆరకముందే ఈ వైరస్‌ వచ్చిందని వ్యాఖ్యానించారు.

ఈ విషయాన్ని తాము ఏ మాత్రం తేలిగ్గా తీసుకోబోమని తెలిపారు. కాగా, కరోనా విషయంలో అమెరికా చట్టసభ ప్రతినిధుల నుంచి ట్రంప్‌పై ఒత్తిడి పెరుగుతోంది. కరోనా పుట్టినిల్లు చైనాపై ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని రిపబ్లిన్‌ పార్టీ ప్రతినిధులు డిమాండ్‌ చేస్తున్నారు. ఆ దేశం వల్లే ప్రపంచానికి కరోనా చేరిందని, విపత్కర పరిస్థితులు వచ్చాయని, చైనాపై ఆంక్షలు విధించాలని కోరుతున్నారు.

  • Loading...

More Telugu News