Rana Daggubati: రానా, నాని మధ్య 'రోకా ఫంక్షన్'పై ఆసక్తికర సంభాషణ!

Funny chat between Rana and Nani

  • వేడుక ఫొటోలు పోస్టు చేసిన రానా
  • నిశ్చితార్థం జరిగిందా అంటూ ఆరా తీసిన నాని
  • రోకా ఫంక్షన్ జరిగిందంటూ రానా రిప్లయ్
  • రోకా ఫంక్షన్ అంటే తనకు తెలియదన్న నాని

టాలీవుడ్ అగ్రనటుడు దగ్గుబాటి రానా, మిహీకా బజాజ్ ల వేడుక తాలూకు ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా సందడి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, రానా, హీరో నాని మధ్య సోషల్ మీడియాలో ఆసక్తికర సంభాషణ జరిగింది. రానా తన వేడుక ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకోగా, నాని వెంటనే స్పందించాడు. అబ్బాయ్, నిశ్చితార్థం జరిగిందా? అని నాని ప్రశ్నించగా, రోకా ఫంక్షన్ జరిగింది అంటూ రానా బదులిచ్చాడు.

అయితే రోకా ఫంక్షన్ అంటే ఏమిటో తనకు తెలియడంలేదని, అందుకే గూగుల్ లో వెతుకుతానని నాని సరదాగా రిప్లయ్ ఇచ్చాడు. అనంతరం ఈ చాట్ కు సంబంధించిన స్క్రీన్ షాట్ ను రానా పంచుకున్నాడు. పెళ్లి పనులు అధికారికంగా ప్రారంభమయ్యే ముందు వధూవరులు ఇళ్లల్లో జరిగే కార్యక్రమమే రోకా ఫంక్షన్ అంటారు. ఉత్తరాదిలో ఇది ఎంతో ప్రాముఖ్యత ఉన్న వేడుక.

Rana Daggubati
Nani
Roka Function
Engagement
Miheeka Bajaj
Tollywood
  • Loading...

More Telugu News