Aishwarya Rai: ప్రపంచ సుందరి కిరీటం ధ‌రించి.. త‌ల్లితో కలిసి భోజనం చేసిన ఐశ్వర్య.. నాటి ఫొటో వైరల్‌‌!

aish viral pic

  • 1994లో ఐష్‌కి ప్రపంచ సుందరి టైటిల్
  • అప్పట్లో దిగిన ఫొటోను షేర్ చేస్తోన్న అభిమానులు
  • ఆకట్టుకుంటోన్న నాటి ఫొటో

బాలీవుడ్ నటి ఐశ్వ‌ర్య‌రాయ్ 1994లో ప్రపంచ సుందరి టైటిల్ అందుకున్న సమయంలో తన తల్లితో కలిసి దిగిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.  మిస్ వ‌ర‌ల్డ్ కిరీటం ధరించి తల్లితో కలిసి ఆమె భోజనం చేసింది. వారిద్దరు కింద కూర్చొని భోజనం చేస్తున్నట్లుగా ఈ ఫొటో ఉంది.  

ప్రపంచ సుందరి టైటిల్ అందుకున్న సమయంలో ఐశ్వర్య ఎంతో భావోద్వేగం చెందింది. తాను అనుకున్నది సాధించానన్న తృప్తి ఆమెలో కనపడింది. ఆ సమయంలోనే తన త‌ల్లి బృందారాయ్ తో కలసి ఆమె భోజనం చేసింది. ఆ సందర్భంగా దిగిన ఆ ఫొటోను ఎవరో సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయగా బాగా వైరల్ అవుతోంది.  
     

Aishwarya Rai
Bollywood
Viral Pics
  • Loading...

More Telugu News