Prashanth Neel: ఎన్టీఆర్ ఎనర్జీపై 'కేజీఎఫ్' దర్శకుడి పవర్ ఫుల్ కామెంట్!

Prashanth Neel wishes NTR in his style
  • న్యూక్లియర్ ప్లాంట్ తో ఎన్టీఆర్ పోలిక 
  • ఈసారి రేడియేషన్ సూట్ తెచ్చుకుంటా  
  • వెరైటీగా బర్త్ డే విషెస్ చెప్పిన ప్రశాంత్    
'కేజీఎఫ్' ఫేం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ఓ భారీ చిత్రం రూపొందనుందంటూ ఇటీవల వార్తలు బాగా వస్తున్నాయి. ఈ ప్రాజక్టు విషయంపై ఇద్దరూ కొన్నిసార్లు కలుసుకుని చర్చించుకున్నారనీ, ప్రాజక్ట్ ఓకే అయిందనీ పలు కథనాలు వచ్చాయి. అయితే, అధికారికంగా మాత్రం ఇంతవరకు వీరి చిత్రంపై ప్రకటన రాలేదు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఎన్టీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని దర్శకుడు ప్రశాంత్ నీల్ చేసిన ట్వీట్ ఈ ప్రాజక్టు విషయాన్ని పరోక్షంగా ధ్రువీకరిస్తోంది.

"ఒక న్యూక్లియర్ ప్లాంట్ పక్కన కూర్చుంటే ఎలా వుంటుందో చివరికి నాకు తెలిసొచ్చింది... నీ చుట్టూ వుండే ఆ క్రేజీ ఎనర్జీని తట్టుకోవడానికి మళ్లీ వచ్చినప్పుడు రేడియేషన్ సూట్ తెచ్చుకుంటానులే.. హ్యాపీ బర్త్ డే సోదరా" అంటూ ప్రశాంత్ తన క్రియేటివిటీతో కూడిన ట్వీట్ వదిలాడు. దీంతో వీరి సినిమా ఖాయమేనని ఎన్టీఆర్ అభిమానులు ఇక ఫిక్స్ అయిపోయారు.

కాగా, వీరి కాంబినేషన్ లో భారీ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనున్నట్టు తెలుస్తోంది. పాన్ ఇండియా చిత్రంగా వివిధ భాషల్లో రూపొందే ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ ఏడాది పాటు డేట్స్ ఇచ్చాడట.        
Prashanth Neel
KGF
Junior NTR

More Telugu News