నాథూరాం గాడ్సే దేశభక్తిని శంకించలేము.. ఒక నిజమైన దేశభక్తుడు: నాగబాబు సంచలన వ్యాఖ్యలు
- ఈ రోజు నాథూరాం గాడ్సే పుట్టిన రోజు
- గాంధీని చంపితే అపఖ్యాతి పాలవుతానని తెలిసినా అనుకున్నది చేశాడు
- ఆయనని ఒకసారి గుర్తు చేసుకోవాలనిపించింది
'గాంధీని చంపితే అపఖ్యాతి పాలవుతానని తెలిసినా తను అనుకున్నది చేశాడు. కానీ, నాథూరాం దేశభక్తిని శంకించలేము. ఆయన ఒక నిజమైన దేశభక్తుడు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయనని ఒకసారి గుర్తు చేసుకోవాలనిపించింది. పాపం నాథూరాం గాడ్సే. మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్' అని ట్వీట్ చేశారు. ఆయన వ్యాఖ్యలపై చాలా మంది నెటిజన్లు మండిపడుతున్నారు. గాంధీజీని చంపిన వ్యక్తిని గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు.