PVP: హరీశ్ తమ్ముడూ... బ్లేడ్ బాబు నీతో సినిమా తీయడట... స్టార్ట్ యువర్ కుమ్ముడు: పీవీపీ

PVP Setire on Bandla Ganesh

  • మా బెజవాడను బ్రహ్మాండంగా చెప్పావు
  • వాడు యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్ కూడా తీయలేడు
  • మిరపకాయను మించి దువ్వాడను దాటించే సినిమా కోసం వెయిటింగ్
  • వైరల్ అవుతున్న పీవీపీ ట్వీట్

ప్రముఖ నిర్మాత, వైఎస్ఆర్ పార్టీ నాయకుడు పీవీపీ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. దర్శకుడు హరీశ్ శంకర్, బండ్ల గణేశ్ మధ్య ట్విట్టర్ వేదికగా వార్ సాగుతున్న వేళ, "పైనున్న అమ్మవారు కిందున్న కమ్మవారు అంటూ మా బెజవాడను బ్రహ్మాండంగా చెప్పావు హరీశ్. బ్లేడ్ బాబు ఇకపై నీతో సినిమా తియ్యడట. వాడు యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్ కూడా తియ్యలేడు. నీకేమో నేనే కాక డజన్ల మంది నిర్మాతలు, మిరపకాయను మించి దువ్వాడను దాటించే సినిమా తియ్యడానికి... వెయిటింగ్" అని ట్వీట్ చేశారు. ఆపై "హరీశ్ తమ్ముడూ స్టార్ట్ యువర్ కుమ్ముడు" అని ఇంకో ట్వీట్ పెట్టారు. ఇవిప్పుడు వైరల్ అవుతున్నాయి.

కాగా, ఆమధ్య 'సరిలేరు నీకెవ్వరు' సినిమా ఫంక్షన్ లో పాల్గొన్న బండ్ల గణేశ్, ఈ సినిమా తరువాత తనను బ్లేడ్ బాబు అని పిలుస్తారని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇక పీవీపీ ట్వీట్ లో గణేశ్ పేరును నేరుగా ప్రస్తావించకుండా బ్లేడ్ బాబు అంటూ వ్యాఖ్యానించారని కొందరు, ఇద్దరూ కలిసి ఎవరిని కుమ్ముతారోనని మరికొందరు కామెంట్లు చేశారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News