Prakasam District: దొనకొండలో దారుణం.. గుప్త నిధుల పేరుతో బాలికపై అత్యాచారం

Girl Raped in Donakonda

  • బస చేసిన ఇంటి యజమాని కూతురిపై కన్ను
  • ఇంటిలో గుప్త నిధులు ఉన్నాయని నమ్మించిన వైనం
  • పూజల పేరుతో గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం

ప్రకాశం జిల్లా దొనకొండలో దారుణం జరిగింది. గుప్త నిధుల పేరుతో బాలికపై ఓ యువకుడు పలుమార్లు అత్యాచారానికి తెగబడ్డాడు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా మాచవరానికి చెందిన విష్ణువర్ధన్ రోగాలు నయం చేసేందుకు తాయెత్తులు కడుతుంటాడు. దొనకొండ మండలంలోని రుద్రసముద్రానికి చెందిన రామాంజనేయులు అనే వ్యక్తితో విష్ణువర్ధన్‌కు ఇటీవల పరిచయమైంది. ఈ క్రమంలో గ్రామంలోని కొందరికి తాయెత్తులు కట్టేందుకు రావాలంటూ విష్ణువర్ధన్‌ను రామాంజనేయులు ఆహ్వానించాడు.

గ్రామానికి వచ్చిన విష్ణువర్ధన్‌కు ఓ ఇంటిలో బస ఏర్పాటు చేశారు. బస చేసిన ఇంటి యజమాని కుమార్తెపై కన్నేసిన విష్ణువర్ధన్ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయని నమ్మబలికాడు. బాలికతో పూజలు చేయిస్తే వాటిని వెలికి తీయొచ్చని చెప్పాడు. నిజమేనని నమ్మిన ఇంటి యజమాని పూజలకు ఏర్పాటు చేశాడు. గదిలోకి వెళ్లిన తర్వాత పూజల పేరుతో బాలికపై విష్ణువర్ధన్ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే, లోపల అతడేవో క్షుద్రపూజలు చేస్తున్నాడన్న అనుమానంతో గ్రామస్థులు అతడిని నిలదీశారు. దీంతో బాలికపై అత్యాచారం విషయం వెలుగుచూసింది. నిందితుడిని చితకబాదిన స్థానికులు ఆ తర్వాత అతనిని పోలీసులకు అప్పగించారు.

Prakasam District
Donakonda
Girl
Rape
  • Loading...

More Telugu News