Jabardast: పాతవాసనతో... పడిపోయిన జబర్దస్త్, కార్తీకదీపం టీఆర్పీ రేటింగ్స్!

Karthikadeepam and Jabardast TRP Down
  • ఆగిన సీరియల్, రియాల్టీ షోల షూటింగ్
  • పాత ఎపిసోడ్ లను రిపీట్ చేస్తున్న చానెల్స్
  • కొత్త సినిమాలకు, వార్తలకు పెరిగిన డిమాండ్
కరోనా ప్రబలక ముందు బుల్లితెర టీఆర్పీ రేటింగ్స్ పేరు చెబితే, ఎవరికైనా గుర్తుకు వచ్చేది కార్తీకదీపం, జబర్దస్త్ షోలే. వీటిని ప్రేక్షకులు కూడా ఎంతో ఆదరించారు. ఎప్పుడైనా ఏదైనా చానెల్ లో కొత్త సినిమా వచ్చినప్పుడు మాత్రమే ఈ రెండు షోలకూ ఆదరణ కాస్తంత తక్కువగా ఉండేది. టీఆర్పీ టాప్ ప్లేస్ లో ఉండే ఈ రెండు కార్యక్రమాలకు ఇప్పుడు ఆదరణ కరవైంది.

ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై నిత్యమూ వస్తున్న కొన్ని ఆసక్తికర సినిమాలు, వార్తలు, ప్రత్యేక కార్యక్రమాలకు టీఆర్పీ పెరిగింది. ఇదే సమయంలో సీరియల్స్, రియాల్టీ షోల షూటింగ్స్ జరగకపోవడంతో జబర్దస్త్ పాత ఎపిసోడ్ లు ప్రసారం అవుతుండగా, కార్తీకదీపం సీరియల్ ను రిపీట్ చేస్తున్నారు. ఈ కారణంతోనూ వీటి రేటింగ్ పడిపోయిందని తెలుస్తోంది. ఎప్పుడూ తొలి రెండు స్థానాల్లో ఉండే ఈ కార్యక్రమాలు, గత వారం కిందకు దిగాయి. కార్తీకదీపం మూడో స్థానంలో, జబర్దస్త్ ఐదో స్థానానికి చేరాయి.
Jabardast
Kartika Deepam
Serials
TRP

More Telugu News