Lockdown: దేశంలో మే 31 వరకు లాక్ డౌన్ ను పొడిగించిన కేంద్రం

Centre extends lock down till May end
  • నాలుగో విడత లాక్ డౌన్ విధించిన కేంద్రం
  • మరో రెండు వారాల పాటు కొనసాగింపు
  • ఆర్థిక కార్యకాలాపాలు కొనసాగించేందుకు కొన్ని మినహాయింపులు
దేశంలో కరోనా కేసుల సంఖ్య లక్షకు చేరువగా నిలిచిన తరుణంలో, ఇప్పటికీ నిత్యం వేలల్లో కేసులు నమోదవుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. నేటితో మూడో విడత లాక్ డౌన్ ముగియనుండగా, తాజాగా నాలుగో విడత లాక్ డౌన్ ప్రకటించారు. ఈ నెల 31 వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్టు కేంద్రం వెల్లడించింది.

ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే ఆర్థిక కార్యకలాపాలు కొనసాగించేందుకు వీలుగా కొన్ని మినహాయింపులు కూడా ఇవ్వాలని కేంద్రం నిర్ణయించినట్టు తెలుస్తోంది. మరికాసేపట్లో దీనికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల కానున్నాయి.
Lockdown
Extension
May 31
Corona Virus

More Telugu News