Deepika Padukone: 13 ఏళ్ల వయసులో హీరోయిన్ దీపిక ఇలా ఉండేది!

deepika padukune at 13

  • ఫొటో పోస్ట్ చేసిన దీపిక
  • 20 ఏళ్ల క్రితం తీసుకున్న ఓ అరుదైన ఫొటో అని వ్యాఖ్య
  • 2000 ఏడాదిలో ఆమిర్ ఖాన్‌తో ఫొటో
  • అప్పట్లో తనకు 13 ఏళ్లు అని కామెంట్

బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకుణే 20 ఏళ్ల క్రితం తీసుకున్న ఓ అరుదైన ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. 2000 ఏడాదిలో ఆమిర్ ఖాన్‌తో కలిసి ఈ బాలీవుడ్ భామ ఈ ఫొటో దిగింది. ఇందులో దీపిక తండ్రి ప్రకాశ్ పదుకుణే, తల్లి ఉజ్జల, సోదరి అనీశా కూడా ఉన్నారు.

అప్పట్లో తనకు 13 ఏళ్లు అని ఆమె తెలిపింది. ఆమిర్ ఖాన్‌తో కలిసి అప్పట్లో లంచ్‌ చేసినట్లు తెలిపింది. అప్పుడు తిన్న పెరుగన్నం మర్చిపోలేదని తెలిపింది. ఇప్పటికీ ఆయనతో భోజనం చేయాలన్న ఆకలితో ఉన్నానని, అయితే, ఆయన తనను ఆహ్వానించట్లేదని తెలిపింది. ఆమె పోస్ట్ చేసిన అరుదైన ఫొటో ఆమె అభిమానులతో పాటు ఆమిర్ ఖాన్ అభిమానులను అలరిస్తోంది.  
          

Deepika Padukone
Bollywood
Aamir Khan
  • Loading...

More Telugu News