Mahesh Babu: మరింత యంగ్‌గా కొత్త లుక్‌లో కనపడుతున్న మహేశ్‌ బాబు.. ఫొటో వైరల్

mahesh babu new look

  • ఫొటో పోస్ట్ చేసిన నమ్రత
  • సితార, గౌతమ్‌లతో మహేశ్ పోజు
  • కూల్‌గా కనపడుతున్న హీరో

కరోనా విజృంభణ నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో షూటింగులు లేకపోవడంతో ఇంట్లోనే గడుపుతున్న సినీనటులు ఈ ఖాళీ సమయాన్ని తమ కుటుంబ సభ్యులతో ముచ్చట్ల కోసం వినియోగిస్తున్నారు. తన భర్త, సినీనటుడు మహేశ్‌ బాబు, కుమారుడు గౌతమ్, కూతురు సితారలకు సంబంధించిన మరో ఫొటోను నమ్రత తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్ చేసింది.

ఇందులో మహేశ్ బాబు చాలా కూల్‌గా యంగ్‌ లుక్‌లో కపడుతున్నాడు. కళ్లజోడు పెట్టుకుని ఆయన ఇచ్చిన పోజుకి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ఆయన మరింత యంగ్‌గా మారిపోయాడని కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల మహేశ్ బాబు తన కుమారుడు, కూతురితో దిగిన ఫొటోలు బాగా వైరల్ అయ్యాయి.  
           

Mahesh Babu
Tollywood
sitara
  • Loading...

More Telugu News